దేశంలో కరోనా వైరస్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 99 లక్షలు దాటింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 26,382 కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 99,32,548కు చేరింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్‌తో 387 మంది మృతి చెందారు.

ఈ మేరకు బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి వివిధ ఆస్పత్రుల ద్వారా కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారి మొత్తం సంఖ్య 94,56,449గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కోవిడ్‌ మృతుల సంఖ్య 1,44,096కు చేరింది. ప్రస్తుతం దేశంలో దేశంలో 3,32,002 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.