స‌ముద్రంలో ఈత కొట్టిన రాహుల్‌

తిరువ‌నంత‌పురం : రాజ‌కీ‌యా‌లతో బిజీగా ఉండే కాంగ్రెస్‌ నేత రాహు‌ల్‌‌గాంధీ ప్రొఫె‌ష‌నల్‌ స్విమ్మర్‌ అవ‌తా‌ర‌మె‌త్తారు. మత్స్య‌కా‌రుల సమ‌స్య‌లను ప్రత్య‌క్షంగా తెలు‌సు‌కో‌వ‌డా‌నికి రాహుల్‌ కేర‌ళ‌లోని కొల్లాం తీరంలో బుధ‌వారం పర్య‌టిం‌చారు. ఈ క్రమంలో మత్స్య‌కా‌రు‌లతో కలిసి ఓ పడ‌వలో సము‌ద్రం‌లోకి వెళ్లిన ఆయన చేప‌లను పట్టేం‌దుకు వలను విసి‌రారు. అనం‌తరం మత్స్య‌కా‌రు‌లతో పాటు సము‌ద్రం‌లోకి దూకి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రి‌చారు. పది నిమి‌షాల పాటు నీటిలో ఈత కొట్టారు. రాహుల్ ఈత కొట్టిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.