ఉపఎన్నికల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌ : ఏపీలోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణలోని నాగార్జునసాగర్‌, గుజరాత్‌లోని మోర్వా హదాఫ్‌(ఎస్టీ), జార్ఖండ్‌లో మధుపూర్‌, కర్ణాటకలో బసవకల్యాణ్‌, మస్కీ(ఎస్టీ), మధ్యప్రదేశ్‌లో దామోహ్‌, మహారాష్ట్రలో పండర్‌పూర్‌, మిజోరాంలో సెర్చిప్‌(ఎస్టీ), నాగాలాండ్‌లో నోక్‌సేన్‌(ఎస్టీ), ఒడిశాలో పిపిలి, రాజస్థాన్‌లో సాహరా, సుజన్‌ఘర్‌(ఎస్సీ), రాజ్‌సమండ్‌, ఉత్తరాఖండ్‌లో సాల్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఈ అన్నీ స్థానాలకు ఏప్రిల్‌ 17న పోలింగ్‌ నిర్వహణ. మే 2న ఫలితాల వెల్లడి. ఆయా స్థానాల్లో ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఈసీ పేర్కొంది.

Press Note for Bye-Elections 2021