హైదరాబాద్: చిరుత అత్యంత వేగంగా పరుగెత్తగలదు. అందుకే ఆహారం కోసం ఏ జంతువునైనా టార్గెట్ చేస్తే దాన్ని ఈజీగా వేటాడగలదు. కానీ, తను టార్గెట్ చేసిన జంతువు తెలివైనదైతే వేగం ఎందుకూ పనికిరాదని ఓ చిరుతకు తెలిసొచ్చింది. ఓ జింకను టార్గెట్ చేసిన చిరుత దానిపైకి వేగంగా దూసుకొచ్చింది. కానీ జింక తెలివిగా వ్యవహరించింది. చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు ఒకవైపు పరుగు తీయబోయిన జింక.. ఆ వెంటనే డైరెక్షన్ మార్చుకుని వెనక్కి పరుగెత్తడం ద్వారా చిరుతను బోల్తా కొట్టించింది. వేగంగా దూసుకొచ్చిన చిరుత తనను నియంత్రించుకునేందుకు ఎక్కువ దూరం పరుగెత్తాల్సి వచ్చింది. ఆ తర్వాత వెనక్కి చూసేసరికి జింక కనిపించకుండా పోవడంతో కంగు తినడం చిరుత వంతైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో షేర్‌చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు లక్షలకు పైగా వ్యూస్, 12 వేలకుపైగా లైకులు, 12 వందలకుపైగా రీట్వీట్లు వచ్చాయి. జింక ఎలా తప్పించుకుందో కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
