సీఎం కి చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా…

నేను ముఖ్యమంత్రి గన్ మెన్ గా పనిచేస్తున్నా…గవర్నమెంట్ కొలువు ఇప్పిస్తా.. మనం ఎంత చెప్తే అంతే అనుకున్నడో ఏందో మరి ప్రగతి భవన్ లో సీఎం దగ్గర పని చేస్తున్న అని చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు కారు డ్రైవర్ గా పనిచేస్తున్న సంతోష్ కాసుల కోసం కక్కుర్తి పడి గన్ మెన్ అవతారం ఎత్తిండు ఫోటోలు మార్పింగ్ చేసి అందరిని నమ్మించిండు చివరికి కటకటలా పాలయ్యిండు.ప్రజలు ఇట్లాంటోల్లతో జర జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నరు.