హైదరాబాద్ ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కి ముందు పరుగెత్తి ట్రాఫిక్ క్లియర్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీ గురించి రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి హరీష్ రావు ఏమన్నారంటే “మానవత్వం పరిమళించే మంచి మనుషుల్ని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిన కాపాడటం కోసం హైదరాబాద్ అబిడ్స్ లో కానిస్టేబుల్ బాబ్జీ పడిన తపన చూసినప్పుడు అంతే సంతోషం వేసింది” అని మంత్రి హరీష్ రావు తెలిపారు .
