నిలిచిన మెట్రోరైలు సేవలు

నగరంలోని మెట్రోరైలు సేవలు మరోసారి నిలిచిపోయాయి. అమీర్‌పేట్ నుంచి జూబ్లీహిల్స్‌ బస్‌స్టేషన్‌ వెళ్తుండగా, మార్గమధ్యంలో 15 నిమిషాలపాటు మెట్రోరైలు నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వెంటనే అలర్ట్‌ అయిన సిబ్బంది హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ వరకు వచ్చిన ట్రైన్‌లో ప్యాసింజర్లను దింపేశారు.

ఆగిపోయిన ట్రైన్‌ను తీసుకువచ్చేందుకు అధికారులు మరో ట్రైన్‌ను పంపారు. అయితే గతంలోనూ మెట్రో రైళ్లలో పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తరచూ ఇలా మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.