కరోనా వైరస్ కోసం ఫైజర్-బయోఎన్‌టెక్ తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇద్దరు నర్సులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నార్వేలో ఈ ఘటన జరిగింది. దీనిపై మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ద నార్వేజియన్ ఏజెన్సీ, నార్వే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విచారణ మొదలుపెట్టింది. పోర్టోలో సోనియా అకెవెడో అనే 41 ఏళ్ల నర్సు.. వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల తర్వాత హఠాత్తుగా కన్నుమూసింది. అయితే ఆమె మరణానికి వ్యాక్సినే కారణమా లేక యాదృచ్ఛికంగా ఈ ఘటన జరిగిందా అన్నదానిపై విచారణ జరుపుతామని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ మెడికల్ డైరెక్టర్ స్టీనర్ మాడ్‌సెన్ వెల్లడించారు. ప్రస్తుతం పెద్ద వయసు ఉన్న వ్యక్తులు మొదట వ్యాక్సిన్ తీసుకుంటుడం వల్ల ఇది యాదృచ్ఛికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాడ్‌సెన్ అభిప్రాయపడ్డారు. ఫైజర్ వ్యాక్సిన్ వల్ల తాము కూడా ఇబ్బంది పడినట్లు గతంలో కొంతమంది వలంటీర్లు చెప్పారు.