మ‌హిళ గుండె, ఆలుగ‌డ్డ‌తో కూర‌..

మ‌హిళ గుండెతో కూర చేయ‌డమేంట‌ని అనుకుంటున్నారా? ఇది నిజ‌మే. ఆ గుండెను ఆలుగ‌డ్డ‌తో క‌లిపి వంట చేశాడు. దాన్ని మ‌రో ఇద్ద‌రు దంప‌తుల‌కు వ‌డ్డించి వారిని అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు న‌ర‌రూప రాక్ష‌సుడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని ఓక్లాహామాలో మంగ‌ళ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఓక్లాహామాకు చెందిన లారెన్స్ ఆండ‌ర్సన్(42).. త‌న ఇంటికి స‌మీపంలోని ఓ మ‌హిళ‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత ఆమె గుండెను బ‌య‌ట‌కు తీసి.. త‌న ఆంటీ, అంకుల్ ఇంటికి వెళ్లాడు. గుండెను ఆలుగ‌డ్డ‌తో క‌లిపి వంట చేశాడు. ఇక ఆ వంట‌కాన్ని అంకుల్‌, ఆంటీతో పాటు వారి నాలుగేళ్ల మ‌నువ‌రాలికి వ‌డ్డించాడు. అనంత‌రం ముగ్గురిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అంకుల్‌, చిన్నారి ప్రాణాలు కోల్పోగా, ఆంటీ ప‌రిస్థితి విష‌మంగా ఉంది.ఈ కేసులో ఆండర్సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించ‌గా చేసిన నేరాన్ని అంగీక‌రించ‌డాడు. 2017లో డ్ర‌గ్స్ కేసులో అరెస్టు అయిన ఆండ‌ర్సన్‌కు 20 ఏండ్ల జైలు శిక్ష విధించ‌గా ఇటీవలే బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. జైలు నుంచి విడుద‌లైన లారెన్స్ ఇలా క్రూరంగా ప్ర‌వ‌ర్తించి ముగ్గురి ప్రాణాల‌ను బ‌లి తీసుకున్నాడు.