పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్‌

వాషింగ్ట‌న్‌: అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని త‌న మార‌లాగో రిసార్ట్‌లో జ‌రిగిన ఓ పెళ్లికి వెళ్లారు. అక్క‌డి కొత్త జంట‌కు విష్ చేసి న‌న్ను మిస్ అవుతున్నారా అని వాళ్ల‌ను అడిగారు. ప‌నిలో ప‌నిగా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ట్రంప్ వ‌చ్చి ఆ ప్ర‌శ్న అడ‌గ్గానే అక్క‌డున్న వాళ్లంతా పెద్ద‌గా న‌వ్వుతూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. చాలా రోజులుగా ట్రంప్ స‌న్నిహితులుగా ఉన్న మేగ‌న్ నోడెర‌ర్‌, జాన్ ఆరిగో పెళ్లి చేసుకున్నారు.

అయితే పెళ్లి వేడుక‌లోనూ ట్రంప్ రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మనార్హం. మెక్సికో స‌రిహ‌ద్దు, చైనా, ఇరాన్‌లాంటి స‌మ‌స్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా ట్రంప్ ప్ర‌స్తావించారు. అస‌లు స‌రిహ‌ద్దులో ఏం జ‌రుగుతోంది? గ‌తంలో ఎప్పుడూ చూడ‌ని దారుణాలు జ‌రుగుతున్నాయి అని ట్రంప్ అన్నారు. బైడెన్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ అమెరికా, మెక్సికో బోర్డ‌ర్‌లో మ‌ళ్లీ చొర‌బాట్లు ఎక్కువ అవుతున్నాయి. అమెరికాలోకి అక్ర‌మంగా వ‌స్తున్న వాళ్ల‌లో మైన‌ర్లు కూడా ఉంటున్నారు.