డిప్రెషన్ తగ్గించే ఆహార పదార్థాలు

డిప్రెషన్ అనేది  సాధార‌ణ మానసిక రుగ్మత.  ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లకు పైగా ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కానీ, కొన్ని సార్లు దీని లక్షణాలు తీవ్రతరం కావచ్చు. నిరాశ తగ్గించేందుకు కొన్ని చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ సహజంగా  తగ్గించుకోవడమే సురక్షితమని నిపుణులు భావిస్తున్నారు. అంటే మనం తినే ఆహారం కూడా డిప్రెషన్ పై కొంత ప్రభావం చూపుతుందట. కాబట్టి మీలో ఎవరైనా నిరాశతో బాధపడుతుంటే కొన్ని ఆహారాలు తిని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు వైద్యులు. అవేంటంటే..

1. పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినే వాళ్లలో డిప్రెషన్ స్థాయిలు చాలా త్వరగా తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వారానికి కనీసం ఆరు పండ్లతో పాటు కూరగాయలు తినే వారిలో నిరాశ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నాయట.

2. తృణధాన్యాలు

ఎక్కువ తృణధాన్యాలు తినడం వల్ల కూడా నిరాశతో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం కలుగుతుందట. వీటితో పాటు రోజుకు మూడు చిన్న స్పూన్ల విత్తనాలు తినడం వల్ల నిరాశ తగ్గుతుంది.

3. పాలు, పాలపదార్థాలు

రోజులో కనీసం మూడు సార్లైనా పాలు, పాలతో తయారు చేసిన రకరకాల పదార్థాలు తినడం వల్ల డిప్రెషన్ లెవెల్స్ లో వచ్చే మార్పులను మీరు గమనించవచ్చు. వీటిలో పసుపు లాంటివి చేర్చుకుంటే మరింత మంచిది.

4. మాంసాహారం, గుడ్లు

వీటితో పాటు సన్నని మాంసాలు, గుడ్లు, టోఫులు, బీన్స్ లాంటి ప్రొటీన్లు కలిగిన ఆహారాలు తీసుకోవడం నిరాశతో బాధపడుతున్నవారికి చాలా మంచిది. అలాగే వారానికి మూడు సార్లు చేపలను తింటే నిరాశ మటుమాయం కావడం ఖాయం.