వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా?

పండ్లు, కూర‌గాయ‌లు తొంద‌ర‌గా పాడ‌వ్వ‌ద్ద‌ని ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అవే కాకుండా వండిన అన్నం, కూర‌లు, ఇత‌ర వంట‌కాల‌ను కూడా ఫ్రిజ్‌లో పెట్ట‌డం కామ‌న్ అయిపోయింది. మ‌రి ఇలా అన్ని ఆహార ప‌దార్థాల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌డం మంచిదేనా? అస‌లు వేటిని ఫ్రిజ్‌లో ఉంచాలి. వేటిని ఉంచ‌కూడ‌దో తెలుసా..


పుదీనా

పుదీనా ఆకుల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు. పుదీనాను ఫ్రిజ్‌లో ఉంచ‌డంవ‌ల్ల ఆకులు న‌ల్ల‌గా మార‌తాయి. అలాంటి ఆకుల‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తే ఆహారం విష‌తుల్యం అవుతుంది. అందువ‌ల్ల తుల‌సి ఆకుల‌ను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో ఉంచ‌కూడ‌దు.

ఆలుగ‌డ్డ‌లు

ఆలుగ‌డ్డ‌ల‌ను ఫ్రిజ్‌లో ఉంచిన‌ప్పుడు వాటిపై తొక్క‌లోని తేమ ఆవిరై గట్టిప‌డుతుంది. దీనివ‌ల్ల ముక్క‌లు త‌ర‌గ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అలాగే లోప‌ల ఉండే పిండి ప‌దార్థం తేమ‌ను పూర్తిగా కోల్పోతుంది. ఫ‌లితంగా వంట‌కాలు రుచి ప‌చి లేకుండా చ‌ప్ప‌గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఉండే చ‌ల్ల‌ని ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా ఆలుగ‌డ్డ‌ల్లో చ‌క్కెర శాతం త్వ‌ర‌గా పెరిగే అవ‌కాశం ఉంది. నీటితో శుభ్రం చేయ‌కుండా, పేప‌ర్ బ్యాగ్‌లో పెట్టి అలాగే ఉంచినా నిల్వ ఉంటాయి.


ఉల్లిగ‌డ్డ‌లు

ట‌మాటాల మాదిరిగానే ఉల్లిగ‌డ్డ‌ల‌ను కూడా ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు. ఉల్లిపాయ‌ల్లో అధిక నీటి శాతం ఉండ‌టం వ‌ల్ల ఫ్రిజ్‌లోని చ‌ల్ల‌ద‌నానికి అవి ఐస్‌లా మారి పొర‌ల‌ను బాగా ద‌గ్గ‌ర‌కు చేరుస్తుంది. ఆలుగ‌డ్డ‌ల‌తో క‌లిపి ఉల్లిగ‌డ్డ‌ల‌ను నిల్వ చేస్తే త్వ‌ర‌గా పాడ‌వుతాయి. ఉల్లిగ‌డ్డ‌ల‌ను క‌వ‌ర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టినా స‌రే త్వ‌ర‌గా వాస‌న‌ప‌ట్టేస్తాయి. ఈ వాస‌న వ‌ల్ల ఫ్రిజ్‌లోపెట్టిన ఇత‌ర ఆహార ప‌దార్థాలు కూడా పాడ‌య్యే ప్ర‌మాదం ఉంది. అందువ‌ల్ల ఉల్లిగ‌డ్డ‌ల‌ను పేప‌ర్ బ్యాగులో నిల్వ చేయ‌డ‌మే మంచిది.


ట‌మాటాలు

టమాటాల‌ను ఫ్రిజ్‌లో పెడితే వాటి మీద ఉండే ప‌లుచ‌టి పొర ముడ‌త‌లు ప‌డిపోయి.. అందులోని విట‌మిన్ సి త‌గ్గిపోతుంది. అలాగే ట‌మాటాల రుచి కూడా పోతుంది. అందుకే ట‌మాటాల‌ను ఫ్రిజ్‌లో ఉంచ‌కూడ‌దు. వీలైనంత వ‌ర‌కు గాలి త‌గిలే ప్ర‌దేశంలో ఉంచ‌డ‌మే మంచిద‌ని న్యూట్రిషియ‌న్లు అంటున్నారు.


వెల్లుల్లి

వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచ‌డం వ‌ల్ల దానిలోని రుచి, సువాస‌న ఇత‌ర గుణాలు పోతాయి. దీనివ‌ల్ల వాటిని ఆహారంలో వాడినా పెద్ద ఫ‌లితం ఉండ‌దు. అలాగే వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచ‌డం వ‌ల్ల కుళ్లిపోయే అవ‌కాశం కూడా క‌ల‌దు.


పుచ్చ‌కాయ‌

పుచ్చ‌కాయ‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు. కొంత‌మంది క‌ట్ చేసిన ముక్క‌ల‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలా పుచ్చ‌కాయ‌ను ఫ్రిజ్‌లో ఉంచితే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు త‌గ్గిపోతాయి. దీంతో తియ్య‌గా ఉండాల్సిన పుచ్చ‌కాయ‌.. చ‌ప్ప‌గా మారిపోతుంది. అలాగే ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల్ల అనారోగ్యం బారిన కూడా ప‌డ‌తారు.