ఆకలి కోపాన్ని పెంచుతుంది..? ఎందుకు తెలుసా..?

ఆకలి వేసినప్పుడు మనిషికి బాగా కోపం వస్తుంటుంది. చిన్న విషయాలకు కూడా అరవడం, చిరాకు పడటం లాంటివి చేస్తుంటారు కదా. నిజంగా ఆకలి కోపాన్ని పెంచుతుందా..?, ఎందుకలా..? అని ఎప్పుడైనా ఆలోచించి చూశారా..! అయితే ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం రండి. గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన స్టడీ ఏం చెబుతుందంటే..  మనిషి బాగా ఆకలితో ఉన్నప్పడు శరీరంలో  గ్లూకోజ్ లెవెల్ ఆకస్మికంగా పడిపోతుంది. అది మానసిక స్థితిపై నాటకీయ ప్రభావాన్ని చూపుతుందట. గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులు మనిషిలో రకరకాల మూడ్ లకు కారణమవుతాయని తేలింది. ఈ అధ్యయనం కోసం.. కొన్ని ఎలుకలను తీసుకుని ఒక గదిలో ఉంచి వాటి బ్లడ్, షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్న సమయంలో వాటి ప్రవర్తను గమనించారు. గ్లూకోజ్ మెటబాలిజమ్ బ్లాకర్ ను ఇంజెక్ట్ చేశారు. తర్వాత అదే ఎలుకలకు నీటిని ఇంజెక్ట్ చేసి వేరే గదిలో ఉంచారు. వాటి గ్లూకోజ్ లెవెల్ పెరిగిందన్నమాట. ముగింపులో ఎలుకలను రెండు గదుల్లోకి ప్రవేశించేలా ఏర్పాటు చేశారు. కానీ.. బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నవి గదికి వెళ్లేందుకు అవి నిరాకరించాయి. ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోవడం వల్ల అవి చాలా ఒత్తిడి, ఆందోళనకు గురయ్యయి. కాబట్టి మళ్లీ అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడకుండా నీటిని ఇంజెక్ట్ చేసిన గదిలోనే ఉన్నాయి.ఈ ప్రయోగంలో పరిశోధకలు ఎలుకల రక్త నమూలను సెకరించి తెలుసుకున్న విషయం ఏంటంటే.. ఒకపూట, లేదా రెండు పూటల భోజనం తినకపోయేసరికి వాటి కార్టికోస్టెరాన్ రక్తస్థాయిలు పెరిగి.. ఫలితంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది. మొదట ఎలుకలకు గ్లూకోజ్ మెటబాలిజం బ్లాకర్ ఇచ్చినప్పుడు ఎలుకలు మరింత మందగించాయి. ఇది గ్లూకోజ్ లెవెల్ తగ్గినందునే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. గ్లూకోజ్ అనేది శరీరంలోని కండరాలకు ఇంధనంగా పనిచేస్తుంది. కాబట్టి గ్లూకోజ్ల లెవెల్స్ సాధారణంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇలాగే మనుషుల్లో కూడా.. చాలా సేపు ఆకలితో ఉండటం వల్ల గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులు వచ్చి.. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, కోపం లాంటివి వస్తుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో పాటు..  శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ లో మార్పులు ముందు ముందు ఊబకాయం, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఆకలిని దాటవేసే ప్రయత్నం చేయకుండా ఉండండి.