బిగ్ బాస్ హౌస్ నుండి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యినట్టు నాగ్ ప్రకటించారు.మెహబూబ్ ఎలిమినేషన్ తో హౌస్ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాక మెహబూబ్ జర్నీని నాగ్ చూపించగా, అది చూసి ఎమోషనల్ అయ్యాడు మెహబూబ్. ఆ తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా సోహైల్, మెహబూబ్ లు ఏడుపు ఆపుకోలేకపోయారు. అఖిల్, సోహైల్, అభిజిత్‌లని టాప్ 5లో ఉండాలని చెబుతూ, అవినాష్ ని జిమ్‌లో ఎక్కువ వర్కవుట్స్ చేయమని అన్నాడు. మెహబూబ్ ఇక హౌజ్‌లో కనిపించడని తలచుకుంటే చాలా బాధగా ఉందన్న సోహైల్.. సీజన్ 1,2, 3 లలో కంటెస్టెంట్స్ ని మరి అతి చేస్తున్నారని అనుకునేవాళ్లం. కాని ఎంత బాండింగ్, ఎంత ఎమోషన్స్ ఉంటాయనేది ఇక్కడ ఉంటేగాని తెలియదు అని సోహైల్ అన్నాడు.వెళ్లేముందు అద్భుతంగా డ్యాన్స్ చేసి మరింత బాధపెట్టాడు మెహబూబ్. పాటకు అనుగుణంగా మెహబూబ్ ఇచ్చిన పర్‌ఫార్మెన్స్ ప్రతి ఒక్కరితో కంట కన్నీరు పెట్టించింది. అనంతరం మెహబూబ్ ని బిగ్ బాంబ్ వేయాలని నాగ్ సూచించాడు. ఈ బాంబ్ ప్రకారం ఆ కంటెస్టెంట్స్ రెండు వారాల పాటు ఎగ్, నాన్‌వేజ్ తినకూడదని అన్నాడు. దీంతో అవినాష్ తనంతన తాను ముందుకు వచ్చి నేను వేసుకుంటాను ఆ బిగ్ బాండ్ అన్నాడు. ఈ విషయంలో కాస్త ఆలోచించిన నాగ్ ఓ వారం ఉంటే సరిపోతుందిలే అని చెప్పడంతో పదకొండో వారం అవినాష్ నాన్‌వేజ్ ముట్టుకోకూడదు.
