మెగాస్టార్ కి కరోనా పాజిటివ్…అయోమయంలో సీఎం కీసీఅర్, నాగార్జున…

తెలుగు చిత్రసీమలో చాలా మంది ప్రముఖులు కరోనా భారీన పడుతున్న విషయం అందరికీ తెలిసిందే,ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కరోనా భారీనా పడ్డారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.”ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను” అని ఆయన తెలిపారు.ఆయన రెండు రోజులక్రితం నాగార్జునతో కలిసి ప్రగతిభవన్ కి వెళ్ళి  ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే, ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానుల తరుపున తీస్మార్ న్యూస్ టీం     “https://teesmaarnews.com/”  ఆకాంక్షిస్తుంది.