న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సీనియర్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అసోంలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 65
ఇందులో సూపరింటెండెంట్ ఇంజినీర్ (డ్రిల్లింగ్)-3, మేనేజర్ (అకౌంట్స్)-1, మెడికల్ ఆఫీసర్-7, సీనియర్ మెడికల్ ఆఫీసర్-7, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్-2, సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్, హెచ్‌ఆర్, లీగల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, జియోఫిజిక్స్, రిజర్వాయర్)-43, సైకోథెరపిస్ట్-1, కాన్ఫిడెన్షియల్ సెక్రెటరీ-1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరితేదీ: జనవరి 15
వెబ్‌సైట్: https://www.oil-india.com/