హైదరాబాద్: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐడీబీఐ బ్యాంకు నియామక ప్రక్రియను చేపట్టింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. అందువల్ల అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేటగిరీల్లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేస్తున్నది.
మొత్తం పోస్టులు: 134
ఇందులో మేనేజర్ (గ్రేడ్ డీ)-62, మేనేజర్ (గ్రేడ్ సీ) -52, మేనేజర్ (గ్రేడ్ డీ)-11, అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ)-9 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తి లేదా ఎంసీఏ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.150
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: జనవరి 7
వెబ్‌సైట్: http://www.idbibank.in