న్యూఢిల్లీ: భారతీయ వాయుసేనలో ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివావిత యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 22న ప్రారంభంకానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-ఎక్స్ ట్రేడ్ (ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ ట్రేడ్ మినహా), గ్రూప్-వై (ఏఐ సెక్యూరిటీ, మ్యుజీషియన్ ట్రేడ్లు మినహా) ట్రేడ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. దీనికోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టార్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరుగనుంది.
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 10 + 2 పాసై ఉండాలి. మూడు సబ్జెక్టులతో కలిపి కనీసం 50 శాతం, ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం వచ్చిఉండాలి. అదేవిధంగా డిప్లొమా చేసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
గ్రూప్-వై ట్రేడ్‌లకు 10+2 పాసై, ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అభ్యర్థులు 21 ఏండ్ల లోపువారై ఉండాలి.
స్టయిఫండ్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14600 ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత గ్రూప్ ఎక్స్ ట్రేడ్‌ల వారికి రూ.33,100, ఇతరులకు రూ.26,900 ఇస్తారు.
ఎంపికవిధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 22
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 7
ఆన్‌లైన్ ఎగ్జామ్: ఏప్రిల్ 18 నుంచి 22 వరకు
వెబ్‌సైట్: careerindianairforce.cdac.in