హిందుస్థాన్‌ పెట్రోలియంలో ఇంజినీర్‌ పోస్టులు

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ప్రముఖ చమురు మార్కెటింగ్‌ సంస్థ అయిన హిందుస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీనిద్వారా 200 పోస్టులను భర్తీచేయనుంది. అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 200

ఇందులో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 120, సివిల్‌ ఇంజినీర్‌ 30, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ 25, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌ 25 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత గ్రూపులో నాలుగేండ్ల ఫుల్‌టైమ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసిఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 15

వెబ్‌సైట్‌:http://www.hindustanpetroleum.com