న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే డీఆర్‌డీవోలో వివిధ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. డైనమిక్ టెస్ట్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ ఆర్మమెంట్ సిస్టమ్స్‌లో ప్రూఫ్ అండ్ ఎక్స్‌పరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (పీఎక్స్‌ఈ)లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని బాలాసోర్, చాందీపూర్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 62
ఇందులో డిప్లొమా టెక్నీషియన్-39 (సినిమాటోగ్రఫీ 2, సివిల్ ఇంజినీరింగ్2, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 14, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 4, ఎలక్ట్రానిక్స్ 1, ఈసీఈ 7, ఈఐఈ 1, మెకానికల్ 7, సర్వే ఇంజినీరింగ్ 1), ఐటీఐ టెక్నీషియన్-23 పోస్టులు (ఫిట్టర్ 7, డీజిల్ మెకానిక్ 1, ఎలక్ట్రిషన్ 3, కోపా 4, ఎలక్ట్రానిక్స్ 2, వెల్డర్ 2, టర్నర్ 2, మెషినిస్ట్ 2)
అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.
ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
స్టయిఫండ్: డిప్లొమా అప్రెంటిస్‌కు నెలకు రూ.8000, ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000 ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 27
వెబ్‌సైట్:http://www.drdo.gov.in