ముంబై: ప‌్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్)లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత కలిగినవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదిక భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంపికైనవారు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 100
ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్-80, ప్రాజెక్ట్ టెక్నీషియన్-20 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసిఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. అప్లయ్ చేసేటప్పుడు మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరిగా ఇవ్వాలి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు వాటి ద్వారానే సమాచారం అందిస్తారు.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 15
వెబ్‌సైట్:http://www.cdac.in