మన దేశంలో ఎక్కువ కాలం కట్టిన కట్టడం ఏది?…

తాజ్ మహల్ అనుకుంటున్నారా? ఐతే మీరు మహల్ మాయలో పడ్డట్టే…కానీ తాజ్ మహల్ కన్నా ప్రాచీన కట్టడం ఒకటి వుంటుంది.ఇంతకీ ఆ కట్టడం ఏంటంటే ఖమ్మం ఖిల్లా.ఊరికి నడి బొడ్డున తల ఎత్తుకొని క్రీ.శ 957వ సంవత్సరంలో నిర్మించబడిన మన ఖమ్మం ఖిల్లా ఇప్పటికీ చెక్కు చెదరకుండా, అలనాటి నిర్మాణ చాతుర్యాన్ని తెలుపుతుంది.దీని వైశాల్యం నాలుగు చదరపు కీ.మీ. దీనిని నిర్మించినది రెడ్డి సోదరులుగా ప్రసిద్ది చెందిన లక్న రెడ్డి మరియు వెలమ రెడ్డి కాగా వారి తరువాత ఒరిస్సాకు చెందిన గజపతిరాజు ఆ తరువాత శ్రీకృష్ణ దేవరాయలు ఆ తరువాత నిజాం ల వరకు చేతులు మారింది ఈ ఖిల్లా.

ఖమ్మం ఖిల్లా మొదట మట్టి కోటగా నిర్మించబడినది.దానిని నిర్మించడానికి 56 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత అంచెలంచెలుగా రాతి కట్టదంగా పరిణితి చెందినది. దీనిలో మొత్తం 12 బురుజులు,10 రాతి దర్వాజాలతో మనకు స్వాగతం పలుకుతాయి.మట్టి గోడగా మొదలయిన ఖమ్మం ఖిల్లా పూర్తి స్థాయి రాతి కోటగా మారడానికి ఎక్కువ కృషి చేసినది నిజాం రాజు అయిన “అసఫ్ జాహి” తాను గ్రానైట్ రాళ్ళతో పటిష్ట పరిచారు.కోట చుట్టూ దాదాపు అరవై ఫిరంగులుండేవని అవి దాదాపు 500 మీటర్ల దూరం వరకు బాంబులు వేసే సామర్ధ్యం కలిగి వుండేవి.ఈ కోటలో ఖమ్మం నుండి ఓరుగల్లు కోటకు సొరంగ మార్గం వుందని చరిత్రకారులు పలు సందర్భంలో వ్యక్తపరిచారు.ఈ కోటలో మొత్తం వర్షధార నీటినీ ఒక్క చుక్క కూడా వృధా కాకుండా చాలా అద్భుతంగా నిర్మించారు.

–> గారపాటి కృష్ణతేజ శశి