యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయంలో కార్తీక శోభ…

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ దేవాలయంలో భక్తుల సందడి నెలకొన్నది. ఇవాళ కార్తీక మాసం తొలిరోజు, అందులోనూ సోమవారం కావడంతో ఆలయంలో కార్తీక మాస శోభ సంతరించుకున్నది. అధికసంఖ్యలో వచ్చిన భక్తులు వేకువజామునే గుట్టపై దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రత మండపం కిటకిటలాడుతున్నది.. స్వామి వారి దర్శనంకోసం భక్తులు క్యూకట్టారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.

 

 

 

*Image Source From:ntnews.com*