తీస్మార్ న్యూస్,క్రైం:వరంగల్ జిల్లాకు చెందిన సాయి కుమార్, సిద్ధిపేట జిల్లాకు చెందిన అశ్విని ప్రేమించుకున్నారు,కలిసి కలకాలం సంతోషంగా జీవించాలనుకున్నారు.ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసి పలుమార్లు యువకుడిని మందలించడంతో మనోవేదనకు గురైన యువకుడు యువతి ఇంట్లో తమ వివాహానికి అంగీకరించరు అని కలిసి బ్రతకలేనప్పుడు కలిసి చావడమే సరి అని నమ్మి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యే తమ సమస్యకు పరిష్కారమనుకుంటున్నారు. పెద్దలను ఎదిరించలేని తమ ప్రేమకు మరణంతోనే ముగింపు పలుకుతున్నారు. ప్రేమించేటప్పుడు ఉన్న ధైర్యం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి ఆ ధైర్యం సరిపోవట్లేదు. కలిసి కాపురం చేయనివ్వరని కలిసి మృత్యువును కౌగిలించుకుంటున్నారు. నూరేళ్ల జీవితానికి మధ్యలోనే విషాదగీతిక ఆలపిస్తున్నారు. పెద్దలను ఎదిరించలేని రెండు ప్రేమజంటలు బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటనలు వెలుగు చూశాయి.మరో ఘటన.. నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (16) మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి శేఖర్ (23) మధ్య ప్రేమ పరిచయంగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలిసి ఇద్దరినీ మందలించారు. పైగా ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని భావించారు. ఈ నెల 15న ఊరి నుంచి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు రెండ్రోజులు వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు ఉంద్యాల సమీపంలోని పొలంలో పత్తి కూలీలకు ద్విచక్ర వాహనంతో పాటు ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. పురుగు మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
