కామాంధులకు బలయిన యువతి

మాయదారి కరోనా వైరస్‌ను జయించింది. కానీ కామాంధులకు బలయ్యింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించి తేయాకు తోటలో అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా ఆ ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ దుండగుల బారి నుంచి ఆమె కుమార్తె తప్పించుకుంది. ఈ ఘటన అసోంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

చారడియో జిల్లాకు తల్లి (54)తో పాటు కూతురి (17)కి కూడా కరోనా సోకింది. సపేకాతి మోడల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకోవడంతో మే 29వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. అయితే వారు అంబులెన్స్‌ పెట్టుకోలేని పేదవారు. దీంతో తేయాకు తోటల మీదుగా తల్లీకూతురు ఇంటికి వెళ్తుండగా చీకటి పడింది.

30 కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో బొర్హట్‌ టీ ఎస్టేట్‌ సమీపంలో ఇద్దరు దుండగులు వచ్చారు. తల్లికూతురిని వెంబడించారు. యుక్త వయసు ఉన్న కూతురు వారి నుంచి తప్పించుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో నీరసంగా ఉండడంతో ఆ తల్లి వారికి చిక్కింది. వారు ఆమెను తేయాకు తోటల సమీపంలో అత్యాచారానికి ఒడిగట్టారు.

అయితే పరుగెత్తుకుంటూ వెళ్లిన కుమార్తె సమీప గ్రామస్తులకు విషయం తెలిపింది. దీంతో ఆ గ్రామస్తులు తల్లి కోసం గాలించారు అయితే దుండగులు అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె ఓ పొదల చాటున నిస్సహాయంగా పడింది. వెంటనే గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అయితే అంబులెన్స్‌ఏర్పాటు చేయకపోవడంతోనే ఆమెపై అఘాయిత్యం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి కేశబ్‌ మహంత ‘నెగటివ్‌ వచ్చిన వారిని ఆస్పత్రి నుంచి ఇంటి వద్ద చేర్చేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించారు.