కరెంట్ షాక్ తో యువ రైతు మృతి

జగిత్యాల,తీస్మార్ న్యూస్: కరెంట్ షాక్ తో యువ రైతు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బద్దం రాంరెడ్డి (25) అనే రైతు తన తాత బద్దం వెంకటిని (60) తొలుకొని పొలం వద్దకు వెళ్లాడు. పొలం వద్ద కరెంటు డబ్బాను సరి చేస్తుండగా విద్యుత్ సరఫరా అయి రాంరెడ్డికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.పక్కనే ఉన్న వెంకటికి షాక్ తగిలి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ జమీలోద్దీన్ ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టర్ కోసం కోరుట్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు రాంరెడ్డికి సంవత్సరం క్రితమే సంధ్యతో వివాహం జరిగింది. సంధ్య 8 నెలల గర్భవతి. రాంరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.