యువ వైద్యుడు మృతి

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన యువ వైద్యుడు రావుల రాజేశ్‌ (30) గురువారం కరోనా వైరస్‌తో మృతిచెందాడు. రాజేశ్‌ కరోనా బారిన పడి తొమ్మిది రోజులుగా హన్మకొండలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి రాజేశ్‌ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

రాజేశ్‌ ఫాండీ అనే ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సును పూర్తి చేసి హన్మకొండలో స్థిరపడ్డాడు. నాలుగేళ్లుగా అక్కడే మాక్స్‌కేర్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. అతను వ్యాక్సిన్‌ వేసుకుని ఉంటే వ్యాధి తీవ్రత ఇంతగా ఉండేది కాదని బంధువులు పేర్కొన్నారు. రాజేశ్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.