గొంతు కోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

భర్త మోసం చేశాడన్న మనస్తాపంతో ఓ మహిళ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ సంఘటన బుధవారం అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. ధర్మవరంలోని గుట్టకిందపల్లికి చెందిన అంజలి(25)కి పురుషోత్తం అనే డ్రైవర్‌తో వివాహమైంది. రెండో వివాహం చేసుకున్న అతడు ఆమెను వదిలేశాడు.

దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం ప్రజలందరి ముందు బ్లేడుతో గొంతు కోసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. ఆమెను అడ్డగించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.