పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్య

ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా వాడుకొని, తర్వాత పెళ్లికి నిరాకరించాడనే మనస్థాపంతో ఓ యువతి (17) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని జీకేబంజరలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. యువతిని అదే గ్రామానికి చెందిన శరత్‌ రెండేళ్లుగా ప్రేమ పేరుతో మోసం చేశాడని, లైంగికదాడికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకోవాలని అడిగితే రూ.5 లక్షలు కట్నంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశాడని తెలిపారు.

తల్లితండ్రులకు అంత కట్నం ఇచ్చుకునే స్థోమత లేక పోవడంతో యువతి పురుగుల మందు తాగిందని, ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఘటనను మరుగున పడేసేందుకు కొందరు నాయకులు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంపై రఘునాథపాలెం ఎస్‌ఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఘటన జరిగిన రోజే కేసు నమోదు చేశామని తెలిపారు.