భార్య మర్మాంగాన్ని వైర్ తో కుట్టేసిన తాగుబోతు భర్త

ల‌క్నో : అనుమానంతో ఓ భ‌ర్త త‌న భార్య ప్ర‌యివేటు పార్ట్‌కు వైర్‌తో కుట్టేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాంపూర్‌లో వెలుగు చూసింది. రాంపూర్ జిల్లాకు చెందిన ఓ తాగుబోతు భ‌ర్త‌.. భార్య‌పై అనుమానం పెంచుకున్నాడు. గ‌త కొద్ది నెల‌ల నుంచి ఆమెను శారీర‌కంగా హింసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె గ‌ర్భం ధ‌రించింది. ఆ స‌మ‌యంలో ఆమె పొత్తిక‌డుపుపై తీవ్రంగా త‌న్న‌డంతో.. ఆబార్ష‌న్ అయింది. ఆ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే.. భార్య నిద్రిస్తున్న స‌మ‌యంలో దారుణ‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. అల్యూమినియం తీగ‌తో ఆమె ప్ర‌యివేటు భాగానికి కుట్టేశాడు. దీంతో ఆమెకు తీవ్ర ర‌క్త‌స్రావ‌మైంది. బాధితురాలు త‌న త‌ల్లిదండ్రుల స‌హ‌కారంతో.. రాంపూర్ ఆస్ప‌త్రికి వెళ్లింది. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.