భర్త కోసం కొట్టుకున్న అక్కా చెళ్లెలు…

ఓ వ్యక్తి కోసం ఇద్దరు కజిన్స్ సిస్టర్స్ గొడవపడ్డారు. అతను నా భర్త అంటే కాదు నా భర్త అంటూ వాదించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరు కొట్లాటకు కూడా దిగారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ హరిద్వార్ జిల్లాలోని రూర్కీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు: రూర్కీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగ్‌నహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ అంబర్ తలాబ్‌కు చెందిన ఓ మహిళకు, మీరట్‌లోని మావానా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో 10 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరికి నలుగురు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే గత నాలుగేళ్లుగా అతడు తన భార్య కజిన్ సిస్టర్‌‌తో(మరదలి) వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయంలో కొన్ని నెలల కిందట అతడికి, అతని భార్యకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.దీంతో ఆ మహిళ తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటుంది. మరోవైపు అతడు మరదలితో వేరే చోటుకు వెళ్లిపోయాడు. ఇక, ఆ వ్యక్తి తన మరదలితో పారిపోయినట్టుగా మావానా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత అతడు రూర్కీలోని ఓ ఇంట్లో పారిపోయిన తన మరదలితో కలిసి అద్దెకు ఉంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రూర్కీ బస్టాండ్‌ సమీపంలో మహిళ తన భర్తను గుర్తించింది. ఈ విషయం పోలీసులకు తెలియజేసింది. దీంతో వారు అతడిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.ఇక, ఆదివారం ఆ వ్యక్తి మరదలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అతడు తన భర్త అని చెప్పింది. ఇటీవలే అతడు తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ఈ క్రమంలోనే వారు అతని విషయంలో గొడవకు దిగారు. మరోవైపు ఈ కేసును రూర్కీ పోలీసులు మీరట్‌కు బదిలీ చేశారు. దీంతో మీరట్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు.