రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్యులు దుర్మరణం

ధార్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్యులు దుర్మరణం చెందిన ఘటన మరవక ముందే మరో వైద్యురాలు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. శిరాకు చెందిన వైద్యురాలు వర్ణిక(33) తన పుట్టిన రోజు సంబరాల కోసం మామ, బీజేపీ నేత బి.గోవిందప్ప, భర్త స్వామిదర్శన్‌ తదితరులతో కారులో గోవా వెళ్లారు.

బుధవారం తిరిగి వస్తుండగా రాణిబెన్నూరు సమీపంలోని బ్యాడగి సర్వీసు రోడ్డులో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు లారీని ఢీకొంది. ప్రమాదంలో వైద్యురాలు వర్ణిక మృతి చెందగా గోవిందప్పకు భుజం, కాలు, వెన్నెముకకు గాయాలయ్యాయి. అత్త రత్నమ్మ, కుమారుడు మోహిత్‌కు చిన్నచిన్న గాయాలయ్యాయి.