బావిలో పడి రైతు మృతి

ఖమ్మం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామానికి చెందిన తీగల రామారావు (38) అనే రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం పొలం పనికి వెళ్లిన రామారావు బావి పక్కన పనిచేస్తూ ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. బావిలో అమర్చిన మోటారు తీగలు కాళ్ళకు చుట్టుకోవడంతో బయటికి రాలేక మునిగి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.