బావిలోకి దూకి ఆత్మహత్య

వేలూరు జిల్లా లత్తేరి సమీపంలోని పాట్టియనూరు గ్రామానికి చెందిన ఏలుమలై(40) మేల్‌మాయిల్‌లోని ప్రభుత్వ పాఠశాల లో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి గత వారం రోజులుగా జలుపు, దగ్గు లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేసుకున్నాడు. పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఈనెల 3న వేలూరు అడుక్కంబరై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. అయితే బుధవారం ఉన్న ఫలంగా మాయమయ్యాడు.

ఈ క్రమంలో గురువారం ఆసుపత్రి సమీపంలోని చిరుకరుంబూరులోని వ్యవసాయ బావిలో మృతదేహం బావిలో తేలుతుండటంతో స్థానికులు గమనించి వేలూరు పోలీసులకు సమాచామిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది బావిలోని మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేపట్టగా.. కరోనా భయంతో పరారైన ఏలుమలైగా గుర్తించారు.