తండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన తనయుడు

బిజినేపల్లి: నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో కన్నతండ్రిని ఇనుపరాడ్డుతో కుమారుడు కొట్టి చంపాడు. బిజినేపల్లికి చెందిన నరసింహ (55), మహేష్ తండ్రీ కొడుకులు. అయితే నిన్న రాత్రి మద్యం మత్తులో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆవేశంతో మహేష్‌ తన తండ్రిని ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన నరసింహ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.