మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి

మహబూబాబాద్:‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద లారీ-ఆటో ఢీకొన్న సంఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు పురుషులు ఉన్నారు. మృతుల వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, గూడూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారుగా భావిస్తున్నారు. ఓ శుభకార్యానికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కినట్లు సమాచారం. ఈ క్రమంలో గూడురు శివారులో లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతోనే నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.