మహిళని కాపాడిన స్థానికులు

న‌మ్మితేనే మోస‌పోతారంటారు. ముఖ్యంగా ప్రేమ‌, పెళ్లిళ్ల విష‌యంలో అబ్బాయిలు చెప్పే మాయ మాట‌ల‌ను అమ్మాయిలు న‌మ్ముతూ మోస‌పోవ‌డం నిత్య‌కృత్య‌మైంది. ఈ జాబితాలో ముంబైకి చెందిన ఓ టీవీ న‌టి చేరింది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా …లైంగిక దోపిడీకి గురైన త‌ర్వాత తాను మోస‌పోయాన‌ని బాధిత టీవీ న‌టి గుర్తించ‌డం గ‌మ‌నార్హం. చివ‌రికి న్యాయం కోసం పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.ముంబైకి చెందిన టీవీ న‌టి పెళ్లి చేసుకోవాల‌నే ఉద్దేశంతో మంచి సంబంధం కోసం మ్యాట్రిమోనియ‌ల్ సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసు కుంది. ఆ సైట్ ద్వారా విమాన ఫైలెట్ ప‌రిచ‌యం అయ్యాడు. కొంత కాలంగా న‌టితో స‌ద‌రు ఫైలెట్ త‌ర‌చూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇద్ద‌రూ ఛాట్ ముచ్చ‌ట్లు చెప్పుకున్నారు.ఛాట్ ముచ్చ‌ట్ల‌తో మొహమెత్తి …ఇక నేరుగా క‌లుసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో ప‌దిరోజుల క్రితం స‌ద‌రు న‌టి ఇంటికి ఫైలెట్ వెళ్లాడు. ఫోన్ సంభాష‌ణ‌లు, ఛాట్‌ల‌తో అప్ప‌టికే మాన‌సికంగా ద‌గ్గ‌రైన ఆ ఇద్ద‌రూ …ఎదురెదురుగా క‌ల‌వ‌డం మ‌రింత య‌వ్వ‌న‌పు కిక్ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటాన‌ని చేతిలో చేయి వేసి అత‌ను వాగ్దానం చేశాడు. దీంతో ఆమె మ‌న‌సు క‌రిగిపోయి, అత‌ని ఒడిలో ఒదిగిపోయింది.క‌ళ్లు తెరిచే స‌రికి మ‌రో ప్ర‌పంచంలో విహ‌రించిన‌ట్టు గుర్తించింది. అలా ప‌లుమార్లు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యారు. పెళ్లి మాట ఎత్తితే, ఫైలెట్ త‌ప్పించుకుంటూ వ‌చ్చాడు. చివ‌రికి తాను మోస‌పోయాన‌ని స‌ద‌రు న‌టి గ్ర‌హించింది. ఈ నేప‌థ్యంలో ఆమె న్యాయ కోసం ముంబై న‌గ‌రంలోని ఓపివారా పోలీస్‌స్టేష‌న్‌ను ఆశ్ర‌యించింది. పెళ్లి చేసుకుంటాన‌నే సాకుతో త‌న‌పై విమాన ఫైలెట్ ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని, పెళ్లికి నిరాక‌రిస్తున్నాడ‌ని, న్యాయం చేయాల‌ని ఫిర్యాదు చేసింది.