తిరువనంతపురం : కేరళలోని కుతిరన్ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిశూర్ సమీపంలో లారీ, కారు సహా వరుసగా ఏడు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఘటన జరగ్గా.. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది. తమిళనాడుకు చెందిన ఓ లారీ నియంత్రణ కోల్పోయి ఇతర వాహనాలను ఢీకొట్టింది. మొదట రెండు కార్లు బైక్‌తో ఢీకొట్టగా.. వెనుక ఉన్న వాహనాలు అదుపు తప్పిముందు ఉన్న ఇతర వాహనాలను ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. బ్రేకులు విరడంతో ట్రక్ నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం.