విష వాయువు పీల్చుకుని ఏడుగురు మృతి

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో టాక్సిక్ గ్యాస్ లీకైనది. ఈ విష వాయువు పీల్చుకుని ఏడుగురు మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యిబిన్‌ నగరంలోని చాంగ్నింగ్‌ కౌంటీలోని ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ ఫ్యాక్టరీలో మరమ్మత్తు పనులు జరిగే సమయంలో ఈ గ్యాస్‌ లీకైనట్లు జిన్హువా కౌంటీ అధికారులు తెలిపారు.

విషవాయువు పీల్చుకుని బాధితులు మొదట స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లారు. వారికి వైద్య చికిత్స అందించడానికి ఆస్పతికి తరలించగా మార్గమధ్యలోనే మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.