హైదరాబాద్ : బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టషన్ పరిధిలోని కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రోస్టేషన్ డివైడర్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై ఓ యువకుడిని నార్కట్‌పల్లి డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువకుడు కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా శ్రీకాంత్‌గా గుర్తించారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.