ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం ట్రక్‌ను ఢీకొన్న ఘటనలో 14మంది మృత్యువాతపడ్డారు. గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రయాగరాజ్‌-లక్నో హైవేపై వెళుతున్న బొలెరో.. ట్రక్‌ను ఢీకొట్టింది. దీంతో వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న 14 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. రోడ్డు ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.