ఉత్తరప్రదేశ్‌లో దారుణం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బస్సు బోల్తాపడిన ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. వివరాలు.. ఆగ్రా ఖండౌలి ప్రాంతంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో గురువారం ఉదయం 100 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది