రంగారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవేళ్ల మండలంలోని మల్కాపూర్‌ గేట్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌- బీజాపూర్‌ రహదారిపై ఇన్నోవా కారు బోర్‌వెల్‌ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కాగా, మృతులంతా హైదరాబాద్‌లోని తాడ్‌బండ్‌ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న శవాలను బయటకు తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.