మెదక్‌ జిల్లాలో విషాద ఘటన

మెదక్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఆటో చెరువులోకి దూసుకుపోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రామాయంపేట పట్టణంలో జరిగింది. రామాయంపేట నుంచి సిద్ధిపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్‌ని తప్పించబోయి ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న మల్లె చెరువులో పడిపోయింది.

ఈ ప్రమాదంలో సంకాపూర్ తండాకు చెందిన రమేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే రామాయంపేట ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.