ముగ్గురు మహిళలు దుర్మరణం

రోడ్డుకిరువైపులా మొక్కలు నాటుతున్న మహిళలపై లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. మంగళవారం ఉదయం చెన్నై ఔటర్‌రింగ్‌ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. వండలూరు నుంచి మీంజురు దాకా ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటే కార్యక్రమం సాగుతోంది.ఈ క్రమంలో మంగళవారం ఉదయం కుండ్రత్తూరు సమీపంలో మహిళా కార్మికులు రోడ్డు పక్కగా మొక్కలు నాటే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ సమయంలో పూందమల్లి నుంచి తాంబరం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి మినీవ్యాన్‌ను ఢీకొని రోడ్డు పక్కగా మొక్కలు నాటే పనిలో ఉన్న మహిళలపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో వయనల్లూరుకు చెందిన పచ్చమ్మాల్‌(45), చెంచులక్ష్మి (28) సంఘటన స్థలంలో మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుగంధి(40) మరణించింది.