ఇదో విచిత్రమైన సంఘటన అనుకోవాలి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఒక తండాకు చెందిన యువకుడు ఆ ప్రాంతంలోనే ఒక వివాహితపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో భయపడ్డ శంకర్ అనే ఆ 22 యేళ్ల యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు!అత్యాచారానికి తెగించిన అతడి మనస్తత్వం చాలా త్వరగా మారిపోయినట్టుగా ఉంది. తను చేసిన తప్పు ఎంత తీవ్రమైనదో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం అయినట్టుంది. దీంతో వాటికి తట్టుకునే శక్తి లేక ఆత్మహత్య చేసుకుని తన పశ్చాతాపంతో తన ప్రాణమే తీసుకున్నాడు.అతడో బోర్ మెకానిక్. ప్రీప్లాన్డ్ గా రేప్ చేసిన వ్యక్తి కాదని పోలీసుల కథనం ప్రకారం స్పష్టం అవుతోంది. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. శంకర్ మధ్యాహ్నం బైక్ పై వెళ్తుండగా, మార్గమధ్యంలో ఒక మహిళ లిఫ్ట్ అడిగిందట. ఆమెను ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి బైక్ ను మళ్లించి అక్కడ బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు శంకర్. వెంటనే అక్కడ నుంచి పరార్ అయ్యాడు. ఆమె తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమెను పోలీసులు శంకర్ సొంతూరికి తీసుకెళ్లారు. వారు తన తండాకు వస్తున్న విషయం తెలుసుకుని శంకర్ ఊరవతలకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.అఘాయిత్యానికి పాల్పడి తప్పు చేశాడు. చేసిన తప్పుకు ఎదురయ్యే పరిణామాలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనునిత్యం అనేక మంది రేపిస్టులు వార్తలకు ఎక్కుతుంటారు.వారిలో ఎంతమంది చేసిన దారుణం పట్ల పశ్చాతాపం ఉంటుందో కానీ, ఆ యువకుడు మాత్రం తను చేసిన నేరం తీవ్రత ఏమిటో చాలా తొందరగా అర్థం చేసుకుని, ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు.
