కీలకపాత్ర పోషించిన పుజారా

ఆస్ట్రేలియా పర్యటనలో చరిత్ర పునరావృతం అవుతుందని భారత బ్యాట్స్‌మన్‌ పుజారా నమ్మకంగా చెప్పాడు. వార్నర్, స్మిత్‌లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా మారినప్పటికీ… భారత పేసర్ల రాణింపుతో మరోసారి ఆసీస్‌ను ఓడించి టీమిండియా సిరీస్‌ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. 71 ఏళ్ల తర్వాత భారత్‌ తొలిసారిగా 2018–19 పర్యటనలో ఆసీస్‌ను టెస్టుల్లో వారి దేశంలో 2–1తో ఓడించింది.

ఈ పర్యటనలో 3సెంచరీలతో కలిపి 500లకు పైగా పరుగులు సాధించిన పుజారా ఈ చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్మిత్, వార్నర్‌ లేనప్పటికీ భారత్‌కు అప్పటి విజయాలు అంత తేలిగ్గా ఏమీ రాలేదని పుజారా అన్నాడు. ఈసారీ తాను బ్యాట్‌తో రాణిస్తానని విశ్వాసం వెలిబుచ్చాడు.