రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును ఢీకొని ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన మొమిన్‌పేట మండలం బూరుగుపల్లి దగ్గర జరిగింది. ఈర్లపల్లి గ్రామానికి చెందిన సంగమేశ్వర్ గౌడ్ (35) ఈర్లపల్లి నుంచి మొమిన్‌పేట మీదుగా సదాశివపేటలో విందుకు వెళ్లివస్తున్నాడు. ఈ క్రమంలో బూరుగుపల్లి దగ్గర సదాశివపేట్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
