ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. మహిళ మృతి

హైదరాబాద్‌‌: మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరంతా నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలం జలాల్‌పూర్‌ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో చంద్రిక మరణించగా, విశ్వనాథ్‌, వివేక్‌, అలేఖ్య గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.