నవ వధువు ఆత్మహత్య

వరంగల్‌ అర్బన్:   అమ్మా.. నన్ను క్షమించండి, నేను సంతోషంగా ఉండాలని పెళ్లి చేశావు. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు. నేను నా భర్తతో ఉండలేకపోతున్నా… ప్రతీ క్షణం నరకం అనుభవిస్తున్నా’అంటూ ఓ నవ వధువు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.జిల్లాలోని నారాయణగిరికి చెందిన మెడబోయిన రజాక్‌ కూతురు రవళికి భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన ఐలబోయిన రాజుతో ఈనెల 11వ తేదీన వివాహం జరిగింది. అయితే రవళి ఇంతకుముందే ఓ యువకుడిని ప్రేమించినా, తల్లిదండ్రుల ఒత్తిడితో రాజును వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రవళి ఆత్మహత్యకు పాల్పడింది.